అధరమెంతో.. అందమంత.. | lip plates in wedding time | Sakshi
Sakshi News home page

అధరమెంతో.. అందమంత..

Apr 21 2014 3:39 AM | Updated on Sep 2 2017 6:17 AM

అధరమెంతో..  అందమంత..

అధరమెంతో.. అందమంత..

ఈమె ఇథియోపియాలోని సూరి తెగకు చెందిన మహిళ. నోట్లో ఈ ప్లేట్ చూశారా.. వీటిని లిప్ ప్లేట్స్ అంటారు.

ఈమె ఇథియోపియాలోని సూరి తెగకు చెందిన మహిళ. నోట్లో ఈ ప్లేట్ చూశారా.. వీటిని లిప్ ప్లేట్స్ అంటారు. ఈ తెగలో ఓ సంప్రదాయముంది. అమ్మాయికి యుక్తవయసు రాగానే.. నోట్లోని పై రెండు పళ్లను తొలగిస్తారు. ఇలా మట్టితో చేసిన ప్లేట్‌లాంటిదాన్ని నోట్లో బిగిస్తారు. పెదాలు సాగేకొద్దీ.. ఆ సైజు పెరిగిపోతుంటుంది. ఎందుకిదంతా అంటే.. ఇదే వారి అందానికి చిహ్నమట. పెళ్లి సమయంలో వారి లిప్ ప్లేట్ ఆధారంగా పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు నుంచి కన్యాశుల్కం(ఆవులు) డిమాండ్ చేస్తాడట. చిన్నసైజు లిప్ ప్లేట్ ఉంటే.. 40 ఆవులు.. పెద్దదైతే.. 60 ఆవులు డిమాండ్ చేస్తారట. కొందరు అమ్మాయిలైతే.. చెవులకూ ప్లేట్లు తగిలించుకుంటారు. అయితే, ఈ మధ్య కొత్తతరం అమ్మాయిలు ఇలా ప్లేట్లు బిగించుకోవడానికి  నిరాకరిస్తున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement