మీరు వెంటనే వెనక్కి రండి! | India Recalls Envoy To Austria Over Fund Misuse Allegation | Sakshi
Sakshi News home page

నెలకు ఇంటి అద్దె రూ.15 లక్షలా?

Dec 30 2019 3:21 PM | Updated on Dec 30 2019 3:49 PM

India Recalls Envoy To Austria Over Fund Misuse Allegation - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ.. నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో ఆస్ట్రియాలోని భారత రాయబారి రేణూ పాల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే వెనక్కి పిలిచింది. రేణూ పాల్‌ను అర్ధంతరంగా వెనక్కి పిలిపించడానికి ముఖ్యంగా.. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే ప్రధానకారణంగా తెలుస్తోంది. 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రేణూ పాల్ ఆస్ట్రియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరో నెలరోజుల్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. కేవలం తన ఇంటి అద్దె కోసం నెలకు రూ.15 లక్షల నిధులు ఖర్చు చేసినట్టు గుర్తించారు.

చదవండి: వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూ దేశాయ్‌

దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. శాఖాపరమైన అనుమతులు తీసుకున్నట్లు తప్పుగా చూపించి పెద్ద ఎత్తున వ్యాట్‌ రీఫండ్‌లు చేసుకున్నారని వీరి నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆమెను డిసెంబర్‌ 30వ తేదీలోగా భారత్‌కు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీచేసింది. మరో నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీకి బదిలీ చేయడంతో పాటు.. ఆర్థిక అధికారాలపైనా కోత విధించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement