గోడలు బద్దలు కొట్టిన తుఫాను.. భయంతో..

Horrifying Video Shows Storm Crash Gym Walls Of School - Sakshi

వాషింగ్టన్‌: పాఠశాల జిమ్‌లో సరదాగా గడుపుతున్న విద్యార్థులను తుఫాను హడలెత్తించింది. తుఫాన్‌ ధాటికి గోడలు బద్దలు కావడంతో భయంతో వారంతా పరుగులు తీశారు. ఈ ఘటన సోమవారం నార్త్‌ కరోలినాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఘటన జరిగిన సమయంలో జిమ్‌లో దాదాపు పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారని యూనియన్‌ ఇంటర్మీడియట్‌ స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. తుఫాను సృష్టించిన బీభత్సంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్లు పేర్కొంది. ఇక నార్త్‌ కరోలినాలోని సాంప్సన్‌ కౌంటీలో తుఫాన్లు చెలరేగుతున్న క్రమంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాను ధాటికి భారీగా చెట్లు, భవనాలు నేలకూలుతున్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top