ఆకాశంలో ‘దేవకన్య’ 

Fairies In The Sky - Sakshi

దేవకన్య నేలకు దిగి వస్తున్నట్లు భలే ఉంది కదా.. మేఘాలు రకరకాల ఆకారాలతో మనకు రోజూ కన్పిస్తాయి. కానీ ఇలా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనం చూస్తాం. చూడగానే సరిపోదు వెంటనే సెల్‌ఫోన్‌లోనో లేదా కెమెరాలోనో బంధించాలి. అప్పుడే ఆ అద్భుతాన్ని మనం నలుగురికి పంచగలం. అచ్చం డానీ ఫెరారోలాగా అన్నమాట. డానీ ఫెరారో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన వాడు. 57 ఏళ్ల ఫెరారో తన భార్యతో కలసి కారులో వెళుతుండగా ‘దేవకన్య’ కనిపించిందట. ఆ సమయంలో కొన్ని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న తనకు ఆ రూపం ఎంతో సాంత్వన చేకూర్చిందని ఫెరారో చెబుతున్నాడు. అయితే ఆ ఆకారం కొద్దిసేపే ఉందట. తన కెమెరాలో బంధించి ఆ రూపాన్ని శాశ్వతంగా పదిల పరుచుకోవాలని భావించాడట. దీంతో ప్రపంచ నలుమూలల్లో నెటిజన్లు ఈ దేవకన్యను దర్శించుకునే భాగ్యం దక్కింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top