దావో.. బ్రేవో.. దావో.. బ్రేవో.. | Davo .. Bravo | Sakshi
Sakshi News home page

దావో.. బ్రేవో..

Oct 15 2014 3:07 AM | Updated on Sep 2 2017 2:50 PM

దావో.. బ్రేవో.. దావో.. బ్రేవో..

దావో.. బ్రేవో.. దావో.. బ్రేవో..

భారీ తుపాను మేఘం ఈమెను మింగేయడానికి వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది కదూ.

భారీ తుపాను మేఘం ఈమెను మింగేయడానికి వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. రెండు వేర్వేరు ఫొటోలను కలిపినది కానే కాదు.. ఇది అచ్చంగా ఒరిజినల్ ఫొటో. దీన్ని తీసింది అమెరికాలోని కాస్పర్‌కు చెందిన నికోలస్ అనే ఫొటోగ్రాఫర్.. ఫొటోలో ఉన్న యువతి అతడి భార్యే.. పేరు  దావో. తుపాన్లకు సంబంధించిన ఫొటోలను చాలా మంది తీస్తారు.

కానీ మనల్ని మింగేసేటట్లుండే ప్రమాదకరమైన మేఘాలు ఉన్నప్పుడు వాటికి దగ్గరగా వెళ్లడం.. వాటిని ఓ యువతి చూస్తున్నట్లు ఫొటోలు తీయడమంటే మాటలు కాదు కదా.. ఇలా తీయడం ప్రమాదకరమని తెలిసినా.. అలాంటి చిత్రాలు తీస్తేనే కదా కిక్ అంటున్నారు ఈ జంట. ‘కొన్నిసార్లు నాకు భయమేస్తుంది. కానీ ఈ జీవితం చాలా చిన్నది. అందుకే ఉన్నన్నాళ్లూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి’ అని దావో చెబుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement