బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి.. | Battery-free devices are radio waves | Sakshi
Sakshi News home page

బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..

Aug 6 2014 3:44 AM | Updated on Sep 2 2017 11:25 AM

బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..

బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..

టెక్నాలజీ మాయ వల్ల ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలనూ ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు వీలు అవుతోంది.

 టెక్నాలజీ మాయ వల్ల ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలనూ ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు వీలు అవుతోంది. కానీ వీటన్నింటినీ ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసేందుకు అమర్చే పరికరాలకూ బ్యాటరీలను ఉపయోగించాల్సి రావడం ప్రస్తుతం ఓ పెద్ద ప్రతిబంధకం. అందుకే అసలు బ్యాటరీ అవసరమే లేకుండా.. రేడియో తరంగాలనే విద్యుత్‌గా వాడుకుంటూ.. వాటి ద్వారానే వై-ఫై పరికరానికి, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానమై పనిచేసే వినూత్న ‘బ్యాటరీ-ఫ్రీ డివైస్’లను భారత సంతతి ఇంజనీర్ శ్యామ్ గొల్లకోట నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన శ్యామ్ ఆవిష్కరించిన ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ అనే ఈ టెక్నాలజీ ప్రస్తుతం వై-ఫై పరికరాలకు రెండు మీటర్ల దూరంలోపు మాత్రమే,  సెకనుకు ఒక కిలోబిట్ వేగంతో పనిచేస్తుంది. దీనిని 20 మీటర్లకు పెంచేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ రావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వీరి పరిశోధన వివరాలను షికాగోలో ఈ నెలలోనే జరిగే ‘అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీస్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ కమ్యూనికేషన్స్’ సదస్సులో సమర్పించనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement