మహిళను మూత్ర విసర్జనకు వెళ్లనీయకుండా..

Air Canada passenger Forced To Sit In her Own Urine For 7 Hours - Sakshi

బొగటాకొలంబియాలో దారుణం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఘోరమైన వేధింపులకు గురి చేశారు సిబ్బంది. మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌లోకి అనుమతి ఇవ్వలేదు. రెండు గంటల పాటు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు తన సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆదే సీటులో ఆమెను కూర్చోబెట్టి 7 గంటల ప్రయాణం చేయించారు. ఈ దారుణ ఘటన కొలంబియాలోని బొగటాలో జరిగింది.

గత నెలలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వెళ్లేందుకు ఓ 26 ఏళ్ల మహిళ కొలంబియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఎక్కారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న మహిళ మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లబోయారు. విమాన సిబ్బంది టాయిలెట్‌లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, త్వరగా టాయిలెట్‌కు వెళ్లాలని సిబ్బందిని ప్రాధేయపడినా కనికరించలేదు. టాయిలెట్‌లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను అడ్డుకున్నారు.

దీంతో చేసేది ఏమిలేక తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి 7గంటల ప్రయాణం చేయించారు. ఆమె కెనాడియన్‌ సీటీకి వెళ్లాక ఓ హోటల్‌కి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను ఘోరంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top