సిరియాలో 85 సైనికుల హతం | 85 Syrian soldiers killed by Islamic State militants | Sakshi
Sakshi News home page

సిరియాలో 85 సైనికుల హతం

Jul 26 2014 6:51 PM | Updated on Sep 2 2017 10:55 AM

సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య భీకర పోరు సాగుతోంది.

డమాస్కస్: సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఉగ్రవాద దాడులను సైనికులు తిప్పికొట్టలేకపోతున్నారు. ఉగ్రవాదులు రెండు రోజులుగా దాదాపు 85 మంది సైనికులను చంపారు.

సిరియా ఉత్తరాది అల్ రక్కా ప్రావిన్స్లో హింస తారస్థాయికి చేరింది. ఉగ్రవాదులు బాంబులు, క్షిపణులతో సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నారు. బాంబు దాడుల్లో సైనికులు, అధికారులు మరణించగా, మరో 200 మంది సైనికుల ఆచూకీ లభించడం లేదు. ఇదే ప్రాంతంలో శనివారం హెలీకాప్టర్ను కూల్చివేశారు. ఈ సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement