సినిమా టికెట్ కోసం వేలు పోగొట్టుకున్నాడు | Youth lost his finger for 'Sardar Gabbarsingh' movie tickets | Sakshi
Sakshi News home page

సినిమా టికెట్ కోసం వేలు పోగొట్టుకున్నాడు

Apr 8 2016 6:33 PM | Updated on Sep 13 2018 3:15 PM

సినిమా టికెట్ కోసం వేలు పోగొట్టుకున్నాడు - Sakshi

సినిమా టికెట్ కోసం వేలు పోగొట్టుకున్నాడు

సినిమా టికెట్లు దక్కించుకోవాలన్న ఆత్రంతో ఓ యువకుడు వేలు పోగొట్టుకున్నాడు.

ఎల్‌బీనగర్ (హైదరాబాద్): సినిమా టికెట్లు దక్కించుకోవాలన్న ఆత్రంతో ఓ యువకుడు వేలు పోగొట్టుకున్నాడు. వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 'సర్ధార్ గబ్బర్‌సింగ్' సినిమా టికెట్ల కోసం ఓ యువకుడు విష్ణు థియేటర్ వద్దకు వెళ్లాడు. 
 
మెయిన్ గేటు ఎక్కి లోపలికి దూకే సమయంలో వాచ్‌మెన్ ఒక్కసారిగా గేటును తెరిచాడు. అప్పటికే గేటుపై ఉన్న ఆ యువకుడు సరాసరి కిందికి దూకడంతో వేలు గేటులో ఇరుక్కుని తెగి పడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని వైద్య చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ... భయంతో బాధితుడు అక్కడి నుంచి పారిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement