- చేనేత కార్మిక సంఘం విమర్శ
- ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర
- జూలై 1న పోచంపల్లి సభతో యాత్ర ముగింపు
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదని, చేనేత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకుడు టి.వెంకట్రాములు విమర్శించారు. చేనేత కార్మికులను చైతన్య పరిచి, సంఘటితం చేసేందుకు తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూలై 1 వరకు చేనేత బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో పి.లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకట్రాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. చేనేత సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామని, నిపుణుల కమిటీ ద్వారా చేనేతరంగ అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఈ రెండేళ్లలో వాటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చేనేతను జౌళిశాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఇంతవర కు అమలుకు నోచుకోలేదన్నారు.
చేనేత బస్సుయాత్ర షెడ్యూలిదీ
ఈ నెల 23 నుంచి చేపట్టే చేనేత బస్సుయాత్ర షెడ్యూలును వెంకట్రాములు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23న మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో బస్సు యాత్ర ప్రారంభమై రెండురోజుల పాటు అదే జిల్లాలో కొనసాగుతుంది. 25న మెదక్, 26, 27 తేదీల్లో కరీంనగర్, 28, 29 తేదీల్లో వరంగల్ జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 30న నల్లగొండ జిల్లాలో ప్రవేశించి, జూలై 1న పోచంపల్లిలో నిర్వహించే బహిరంగసభతో బస్సుయాత్ర ముగుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పెండెం సర్వేశంను చేనేత సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏశాల అశోక్, ఎం.జనార్దన్, ఎల్.యాదగిరి, జల్దిరాములు, సీహెచ్ ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.
చేనేత సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం
Published Wed, Jun 15 2016 12:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement