నగరంలో మరో రౌడీషీటర్ హత్య | rowdy sheeter brutally killed in falaknuma police station limits | Sakshi
Sakshi News home page

నగరంలో మరో రౌడీషీటర్ హత్య

Jul 26 2016 10:20 AM | Updated on Sep 4 2017 6:24 AM

నగరంలోని మరో రౌడీషీటర్ దారుణ హత్యకు గురైయ్యారు.

హైదరాబాద్ : నగరంలోని మరో రౌడీషీటర్ దారుణ హత్యకు గురైయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో టికల్కుంట ప్రాంతంలో రౌడీషీటర్ ఫైరోజ్‌ను ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం ప్రత్యర్థులు అక్కడ నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు ముహమ్మద్ ప్రూట్, ఆసిఫ్, బాబాఖాన్‌లతో ఉన్న వైరమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement