ఒకేసారి 400 మందికి ప్లేస్‌మెంట్‌ | Sakshi
Sakshi News home page

ఒకేసారి 400 మందికి ప్లేస్‌మెంట్‌

Published Tue, Jun 20 2017 2:15 AM

ఒకేసారి 400 మందికి ప్లేస్‌మెంట్‌

తెలంగాణ న్యాక్‌ ఘనత.. కేంద్రం అభినందన

సాక్షి, హైదరాబాద్‌: వారంతా పదో తరగతి, ఇంటర్‌ స్థాయిలోనే చదువు ఆపేసిన యువకులు. పేదరికంతో చదువు కొనసాగించలేక వృత్తి విద్యలో నైపుణ్యం సాధించాలని ఆరా టపడ్డారు. వారికి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) భవన నిర్మాణానికి సంబం ధించి వివిధ ట్రేడ్‌లలో శిక్షణ ఇచ్చింది. తరగతుల అనంతరం నెల రోజుల్లో వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు చూపింది. ఒకేసారి 400 మందికి ఉపాధి లభించటంతో తెలంగాణ ‘న్యాక్‌’ పనితీరును కేంద్రం గుర్తిం చింది. న్యాక్‌ డీజీని కేంద్ర ఔత్సాహిక పారి శ్రామిక, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌రూడీ ఢిల్లీ పిలిపించుకుని చర్చించారు. త్వరలోనే హైదరాబాద్‌ న్యాక్‌ను సందర్శించి ఇతర రాష్ట్రాల్లో వాటి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.

తొలి ఘనత: హైటెక్స్‌ ప్రాంగణంలోని న్యాక్‌తోపాటు జగిత్యాలలోని ఉపకేంద్రంలో నిరుద్యోగ యువతకు భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వటం కొన్నేళ్లుగా జరుగు తున్నదే. కానీ ఒకే విడతలో 400 మందికి ప్లేస్‌మెంట్స్‌ రావటం ఇదే తొలిసారి. ఈ ఘనతే తెలంగాణ న్యాక్‌ వైపు కేంద్రం చూసేలా చేసింది. పదో తరగతి విద్యార్హతతో మంచి వేతనాలకు వీరు ఎంపికవటాన్ని గుర్తించిన రూడీ.. తాజాగా తెలంగాణ న్యాక్‌ డీజీ బిక్షపతిని ఢిల్లీ ఆహ్వానించి న్యాక్‌ వివరాలు, పనితీరుపై ఆరా తీశారు. కేంద్రం తరుఫున తెలంగాణ న్యాక్‌కు అవసరమైన సహాయంఅందిస్తామని, జాతీయ స్థాయిలో న్యాక్‌ సేవలందించాలని సూచించారు.

Advertisement
Advertisement