పొగమంచుతో శంషాబాద్లో విమానం అత్యవసర లాండింగ్ | indigo aeroplane emergency landing in hyderabad due to fog | Sakshi
Sakshi News home page

పొగమంచుతో శంషాబాద్లో విమానం అత్యవసర లాండింగ్

Jan 18 2014 8:30 AM | Updated on Sep 2 2017 2:45 AM

బ్యాంకాక్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ ఇండిగో ఎయిర్లైన్స్ విమానాన్ని పొగమంచు కారణంగా హైదరాబాద్లో అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది.

సంక్రాంతి వెళ్లిపోయినా పొగమంచు మాత్రం ఇంకా తగ్గలేదు. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బ్యాంకాక్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ ఇండిగో ఎయిర్లైన్స్ విమానాన్ని హైదరాబాద్లో అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది.

దట్టమైన పొగమంచు కారణంగా ఆ విమానం ముందుకు వెళ్లే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో ప్రమాదాన్ని నివారించేందుకు అత్యవసరంగా విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ల్యాండ్ చేశారు. పొగమంచు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే విమానాన్ని మళ్లీ కోల్కతాకు పంపే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement