► ఆపదలో ఉన్న మహిళల కోసం యాప్
► రూపొందించిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య
► పాన్-ఇండియా యాప్ క్రియేషన్ పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేలా... అత్యవసర సమయంలో సైరన్ మోగేలా సరికొత్త యాప్... ‘గో గర్ల్’ను అందుబాటులోకి తెచ్చింది నగరంలోని ఇంజనీరింగ్ విద్యార్థిని పి.దివ్య. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఆటోమేటిక్‌గా రికార్డయ్యేలా రూపొందించిన ఈ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇటీవల చెన్నైలో జరిగిన యాప్ క్రియేషన్ ఫైనల్స్‌లో తొలి బహుమతిని కై వసం చేసుకుంది. 17 రాష్ట్రాలకు చెందిన 700 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇందులో పోటీపడ్డారు. నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న దివ్య... యాప్ విశేషాలను ‘సాక్షి’కి వివరించింది.
త్వరలో గూగుల్ ప్లే స్టోర్‌లో..
కిడ్నాప్‌లు, బెదిరింపులు, అత్యాచారయత్నాలు, అల్లరి, ర్యాగింగ్‌లకు పాల్పడే వారి నుంచి తమను తాము రక్షించుకొనేందుకు మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ సైరన్ మోగుతుంది. సాక్ష్యాధారాలు కూడా రికార్డవుతాయి. ఫలితంగా నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాలేజీ అమ్మారుులు, రాత్రి విధులు నిర్వహించే ఐటీ, కాల్‌సెంటర్ తదితర మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అవస్థలకు ఈ ‘గో గర్ల్.. బి అలర్ట్... బి సేఫ్’ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. మహిళలు తమ వ్యక్తిగత భద్రత కోసం ఆండ్రారుుడ్ మొబైల్ ఫోనులో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సేఫ్/అన్‌సేఫ్ ఇండికేషన్
యాప్‌లో ని ‘కాల్ కాంటా క్ట్’ ఆప్షన్‌లో ఐదు నంబర్లు యాడ్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో స్క్రీన్‌పై ‘హెల్ప్ మీ’ అనే బటన్ నొక్కితే చాలు.. వెంటనే ఆయా నంబర్లతో పాటు పోలీసు కంట్రోల్ రూమ్, ఉమెన్‌స హెల్ప్‌లైన్, ఎన్‌సీడబ్ల్యూ, యాంటీ స్టాకింగ్ కాల్స్, అంబులెన్‌స, ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లకు ఆటోమేటిక్‌గా మెస్సేజ్ వెళ్తుంది. దీంతో బాధితురాలు ఏ లొకేషన్‌లో ఉందనే విషయం గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి ప్రమాదం నుంచి కాపాడే వీలుంది. ఆత్మరక్షణ కోసం పోలీసు సైరన్, కోర్టులో పక్కాగా సాక్ష్యం సమర్పించేందుకు ఆటోమేటిక్ వారుుస్ రికార్డింగ్ కూడా ఉంది. ఆపదలో ఉన్న మహిళలు ‘హెల్ప్ మీ’ ఆప్షన్ నొక్కడం ద్వారా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకొనే ఫీచర్ (సేఫ్/అన్‌సేఫ్ ఇండికేషన్‌స) దీని ప్రత్యేకత. ఆపదలో ఉంటే రెడ్ సిగ్నల్, లేదంటే గ్రీన్ సిగ్నల్ గూగుల్ మ్యాప్‌లో కనబడుతుంది.
గో గర్ల్.. బి అలర్ట్.. బి సేఫ్
Published Mon, Oct 24 2016 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement