స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి | 2 years old boy killed by school bus | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి

Dec 18 2015 6:31 PM | Updated on Sep 3 2017 2:12 PM

పాఠశాల నుంచి వస్తున్న అన్నయ్యతో కలిసి ఆడుకోవడానికి ఎదురుచూస్తున్న చిన్నారి అన్నయ్య స్కూల్ బస్సు రాగానే పరిగెత్తుకెళ్లి ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కింద పడి మృతిచెందాడు.

పెదకాకాని (గుంటూరు) : పాఠశాల నుంచి వస్తున్న అన్నయ్యతో కలిసి ఆడుకోవడానికి ఎదురుచూస్తున్న చిన్నారి అన్నయ్య స్కూల్ బస్సు రాగానే పరిగెత్తుకెళ్లి ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కింద పడి మృతిచెందాడు. బస్సు కింద చిన్నారి పడిన  విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో.. వెనుక చక్రాల కింద ఆ చిన్నారి చిధ్రమయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ప్రదీప్(6) స్థానిక బీవీఆర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజూ స్కూల్ బస్సు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాడు. అలాగే శుక్రవారం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న రెండేళ్ల చిన్నారి బబ్లూ అన్నయ్య కోసం పరిగెత్తుకుంటూ బస్సు వద్దకు వచ్చాడు. ఆదే సమయంలో అన్నయ్య బస్సులో నుంచి స్కూల్ బ్యాగ్, బాస్కెట్‌తో దిగుతున్న క్రమంలో బబ్లూ స్కూల్ బస్సు కిందికి వెళ్లాడు. ఇది గుర్తించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో వెనక చక్రాల కిందపడిన చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement