రోల్ మోడల్స్ తల్లిదండ్రులే.. | Role Models parents .. | Sakshi
Sakshi News home page

రోల్ మోడల్స్ తల్లిదండ్రులే..

Feb 12 2015 12:34 AM | Updated on Apr 3 2019 6:23 PM

రోల్ మోడల్స్ తల్లిదండ్రులే.. - Sakshi

రోల్ మోడల్స్ తల్లిదండ్రులే..

‘సినిమాలను కేవలం సినిమాలుగానే చూడండి. రోల్ మోడల్స్ మీ తల్లిదండ్రులే. వాళ్లను మించి మిమ్మల్ని ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు’...

‘సినిమాలను కేవలం సినిమాలుగానే చూడండి. రోల్ మోడల్స్ మీ తల్లిదండ్రులే. వాళ్లను మించి మిమ్మల్ని ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు’ అంటూ టీనేజర్స్‌కు హితబోధ చేశాడు నవతరం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. బంజారాహిల్స్‌లోని వర్టిగో ది హై లాంజ్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఈ సిటీ అంటే నాకు ఇష్టం. ముంబై తర్వాత ఇక్కడ షూటింగ్ అంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మా నాన్నగారికి చాలా మంది సన్నిహితులున్నారు’అంటూ నగరంపై ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో నటి యామీ గౌతమి పాల్గొని మాట్లాడుతూ తాను నటిస్తున్న తెలుగు సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ షూటింగ్ పూర్తయిందన్నారు.

అమ్మాయిలందరూ తెలివైన, అందమైన వారేనని అయితే పుట్టిన ప్రాంతం, పెరిగిన వాతావరణాన్ని బట్టి వారి రాణింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వర్టిగో ది హై లాంజ్ లోగోను వీరు ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement