మే 11న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on-may 11 the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 11న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 11 2015 12:24 AM | Updated on Sep 3 2017 1:48 AM

మే 11న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 11న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ తేదీన పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొంచెం ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది.

ఆదాశర్మ (బాలీవుడ్ నటి), వడ్డే నవీన్ (నటుడు)
ఈ తేదీన పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొంచెం ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది. ఈ సంవత్సర సంఖ్య 6 కావడం వల్ల కొత్త ప్రాజెక్టుల జోలికి పోకుండా, పాత వాటినే కొనసాగించి, వాటిని పూర్తి చేయడం మంచిది. అవివాహితులకు వివాహమయ్యే అవకాశాలు, సంతానం లేని వారికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులు, గృహోపకరణాలను అమర్చుకుంటారు. ఉద్యోగరీత్యా విదేశాలలో ఉంటూ, స్వదేశానికి వచ్చి, తలిదండ్రులతో గడపాలని కోరుకునేవారి కల ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది.

ఏ విషయంలోనైనా ఆవేశ కావేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించడం మంచిది. సైన్స్ గ్రూప్ విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. లక్కీ నంబర్స్: 1, 2, 6; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, సిల్వర్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, సిల్వర్, బ్లూ.
 - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement