‘‘పాపం... దానికింత జండూబామ్ ఇచ్చే దిక్కుండదు. కానీ నడుములు పడిపోయేలా డాన్స్ చేస్తుంటుందిరా’’ అన్నాడు రాంబాబు.
‘‘ఎవరది?’’ విషయం తెలియక అడిగా.
‘‘ఇంకెవరు... మన నాగుపామే. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఎవడి నిధి, నిక్షేపాలకో సెక్యూర్టీ గార్డు డ్యూటీ చేస్తుంటుందా! రోజంతా నెత్తిన మణి పెట్టుకొని ఆ మోతబరువంతా మోస్తుందా! మళ్లీ మరో చోట గారడీవాడి జేబులోకి నాలుగు కాసులు రాలడానికి, పొద్దస్తమానం వాడి బుట్టలో పడుకోడానికి తయారు. దాని త్యాగాన్ని చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి రా’’ అన్నాడు రాంబాబు గాడు.
రోజురోజుకూ మా రాంబాబు ధోరణికి బీపీ రెయిజ్ అవుతోంది నాకు.
ఏది ఏమైనా వాడిని దారికి తెచ్చుకోవాల్సింది నేనే కదా. అందుకే వాడికి రెండు హితవు మాటలు చెప్పా.
‘‘ఒరేయ్ లోకమంతా ఓ దారయితే నువ్వు మరో రూటు రా. కాటేసే పాముకు మంచితనం ఏంట్రా?’’ అని అననైతే అన్నాను కానీ...
వాడు చెప్పింది విన్న తర్వాత నాకూ పెద్దగా తప్పనిపించలేదు. అలంకార్ టాకీస్ దగ్గర గారడీవాడు ప్రదర్శించిన, ఉచిత పబ్లిక్ షో చూసి వస్తున్నాట్ట. వెంటనే వాడు నాగుపాము పక్షం వహించాడు.
‘‘అదెంత మంచిదో... దాని శ్రమను అప్పనంగా దోచుకునే గారడీవాణ్ణి చూడు. అదెంత మంచిదో... అమాయకంగా వాడు ఆడించినట్టల్లా ఎలా ఆడుతుందో చూస్తే తెలుస్తుంది. ఒక్క వాడికనే ఏమిటిలే అలనాటి మన శ్రీదేవి దగ్గర్నుంచి మొన్నటి మల్లికా షెరావత్ వరకూ అందరికీ తన రోల్స్ ధరించే అవకాశం ఇచ్చింది. తన కాస్టూమ్స్ వేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లలా ఫ్యామిలీ పాములుండేవి. నువ్వు నమ్మవుగానీ... అప్పట్లో ఫ్యామిలీ పాముల కాన్సెప్టుతో నోము లాంటి సినిమాలూ వచ్చేవి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఎవరిమాటా కాదనదురా పాపం పాము...’’
‘‘సామాన్యుల మాట కూడా కాదనదా?’’
‘‘అవును. నాగుల చవితి రోజున పాలు పోస్తుంటే తన ఒళ్లూ ఇల్లూ గుల్లయ్యేలా పబ్లిక్ పాలు పోస్తున్నా... వద్దు అనదు రా అది. ఏమైనా చెప్పాలంటే పళ్లు లేక, కోరలు పీకి ఉన్న అది ‘బుస్ బుస్’ అంటూ మూగగా రోదిస్తుంటుంది. గారడీవాడు బూర పైకి లేపినప్పుడల్లా ఇది తోక మీద లేవాలి కదా. దాంతో వాడి బూర ఊదుడుకు తగ్గట్లు డాన్స్ చేయడానికి దాని తల ప్రాణం తోకకు వస్తుందిరా’’ అన్నాడు.
‘‘ఇంకొక్క మాట మాట్లాడితే బుర్ర బద్దలు కొట్టేస్తా. ఇంక నోర్ముయ్’’ అని కోప్పడ్డాను. వెంటనే వాడు... ‘‘ఒరేయ్... మంచితనం అన్నది కొబ్బరి నీళ్ల లాంటిది, కానీ సదరు మంచితనాన్ని మన ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలంటే బొండాకు బొక్కెట్టకుండా, టెంకాయను పగలగొట్టకుండా, పాముకు పడగ విప్పనియ్యకుండా పనవుతుందా? అందుకే రా అనాదిగా నీలాంటి వాళ్ల చేతుల్లో మాలాంటివాళ్ల బుర్రబద్దలు అవుతూనే ఉన్నాయి. గారడీవాడి బూరలకు అమాయకప్పాముల పడగలు వాచిపోతున్నాయి’’ అంటూ ఆవేశపడ్డాడు.
ఇలా మాటల్లో నడుస్తూ, నడుస్తూ... మా అక్కవాళ్ల ఇంటి దగ్గరకు చేరాం.
నేను చెబితే ఎలాగూ వినడం లేదు. పెద్దవాడు... కనీసం మా బావతోనైనా చెప్పిద్దామని ఆయనతో విషయమంతా చెబితే... ‘‘పాములు విషం కక్కుతాయనీ, నేను నిజం కక్కుతాననీ ప్రతీతి. అయినా రాంబాబు గాడు చెప్పింది నిజమేనేమోరా... అంతే అందంగా ఉండి, ఒకవేళ విషం గానీ లేకపోతే మన నాగుపామును పెంచుకోవాలని ఉబలాటపడనివాడు ఎవడైనా ఉంటాడా? అయినా ఒక్క మాట చెబుతా వినండ్రా. అక్రమంగా ‘మనీ’ సంపాదించే ‘కాల్’నాగుల కంటే... మన కాలనాగు బెటర్ కాదంటావా?’’ అన్నాడు మా బావ చిద్విలాసం చిందిస్తూ!!
- యాసీన్
సర్ప సందేశం!
Published Mon, Dec 28 2015 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement