కోపం తట్టుకోలేక!

Delhi Police Evidence Submitted in Sunanda Pushkar Case - Sakshi

అందగాడైన కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అంతరంగపు వికృతరూపం త్వరలో ప్రత్యక్షమవబోతోందా! ఆయన భార్య సునందా పుష్కర్‌ హఠాన్మరణానికి సంబంధించి అతడిని వేలెత్తి చూపించే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు వాదనల సమయంలో మళ్లొకసారి కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న పర్యవసానమే సునంద మరణం అనే అనుమానం బలపడుతోంది. తోపులాట కారణంగా సునంద శరీరంపై మొత్తం పదిహేను చోట్ల బలమైన గాయాలు అయినట్లు పోలీసులు గతంలోనే చార్జిషీటు దాఖలు చేశారు. పాకిస్తానీ మహిళా జర్నలిస్టుకు భర్త పంపిన ప్రణయ సందేశాలను చూశాక సునంద కోపం తట్టుకోలేకపోయారని, ఆ గొడవలో శశి థరూర్‌తో జరిగిన పెనుగులాటలో ఆమె గాయపడి, మరణించారని పోలీసులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top