పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | birthday celebrated celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 24 2015 11:48 PM | Updated on Sep 3 2017 4:18 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య.

ఈ రోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కరిష్మాకపూర్ (నటి) సురేష్‌కృష్ణ (దర్శకుడు)

హ్యాపీ బర్త్ డే
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య. మీరు ఈ ఏడాది ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులనే పేరుతో పాటు విజయాలను అందిపుచ్చుకుంటారు. కొత్త స్నేహితులు వస్తారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం, నలుగురిలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు  మంచి కాలేజీలలో వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి.  చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆపోజిట్ సెక్స్ వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా భార్యాభర్తలు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,3,7; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: ఆది, సోమ, గురు వారాలు. సూచనలు: దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పండితులను, గురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. డబ్బును ఆచితూచి ఖర్చు చేయడం మంచిది.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement