పవన్‌ కళ్యాణ్‌కు హరీష్‌రావు లీగల్ నోటీస్ | Legal notice to Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌కు హరీష్‌రావు లీగల్ నోటీస్

Apr 29 2014 8:53 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కళ్యాణ్‌కు  హరీష్‌రావు లీగల్ నోటీస్ - Sakshi

పవన్‌ కళ్యాణ్‌కు హరీష్‌రావు లీగల్ నోటీస్

సినిమా హీరో, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు టిఆర్ఎస్ నేత హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు.

హైదరాబాద్: సినిమా హీరో, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు టిఆర్ఎస్ నేత హరీష్ రావు లీగల్ నోటీసు పంపారు.  పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో హరీష్ రావుకు వ్యాపార సంబంధాలున్నట్లు రెండు రోజుల క్రితం పవన్ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తానని హరీష్ నిన్న హెచ్చరించారు.హరీష్ హెచ్చరికకు పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సమాధానంలేదు. దాంతో ఆయన ఈరోజు లీగల్ నోటీసు పంపారు.

 ఇదిలా ఉండగా, నిజామాబాద్ కోర్టు ఆదేశాల మేరకు  పవన్ కల్యాణ్పై డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని  న్యాయవాది రవి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేయమని  న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దాంతో  ఐపీసీ 153-ఏ, 506 సెక్షన్ల ప్రకారం పవన్ కళ్యాణ్పై నిజమాబాద్ జిల్లా డిచ్పల్లిలో కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేశ్వరరావు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement