గజ్వేల్ బహిరంగ సభలో కేసీఆర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మనది కొత్త సంసారం.. కొత్త కుండలో ఈగలు పడ్డట్టు చేసుకోవద్దు.. ఇంకా మనం అనుకున్న తెలంగాణ రాలేదు, ఆంధ్రోళ్లతోటి పంచాయితీ ఒడవలేదు.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పంపకాల్లో కిరికిరి పోలేదు.. మనం కోరుకున్న తెలంగాణ మనకు కావాలంటే అధికారం మన చేతిల్నే ఉండాలె..’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్లే ఉండాలని, ఆంధ్ర ప్రభుత్వంలో ఆంధ్రావాళ్లు ఉండాలని.. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని స్పష్టం చేశారు. ఆంధ్రోళ్ల డబ్బుతో ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. తెలంగాణ కోసం ఏం నిలబడతారని మండిపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
‘‘మనకు నీళ్లలో అన్యాయం జరిగింది, నిధుల్లో.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది.. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇప్పటికైనా మనం అనుకున్న తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణకు కొద్దిగా నత్తి ఉంది. ఆంక్షలతో కూడిన తెలంగాణ వద్దని మొత్తుకున్నా ఢిల్లీ ఏఐసీసీ వినలేదు. మనం కోరుకున్న సంపూర్ణ తెలంగాణ మనకు కావాలె. సంపూర్ణ తెలంగాణ సిద్ధించాలె. నీళ్లు.. నిధులు.. నియామకాలు ఇదే ఉద్యమ ట్యాగ్‌లైన్. జనాభా లెక్కన ఉద్యోగులను పంచుడు బాధాకరం. సచివాలయంలో 90 శాతం మంది ఆంధ్రోళ్లే ఉన్నరు. జనాభా లెక్కన పంచితె అన్యాయం జరుగుతది. ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు. తెలంగాణ ప్రభుత్వంల తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్ర ప్రభుత్వంల ఆంధ్రా వాళ్లు ఉండాలె’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇంకా పంచాయితీ ఉంది..
ఇంకా ఆంధ్రావాళ్లతో పంచాయితీ అయిపోలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘జూన్ 2 తరువాత పంపకాల పంచాయితీ ఉన్నది. నీళ్ల పంపకం, ఉద్యోగాల పంపకం ఉన్నది.. ఆస్తులు, అప్పుల పంపకం ఉన్నది. మనకు రావాల్సింది మనం తీసుకున్నప్పుడే సంపూర్ణ తెలంగాణ వచ్చినట్టు. ఈ పంపకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే అధికారం మన చేతిల్నే ఉండాలె. మనది కొత్త సంసారం.. కొత్త కుండల ఈగలు పడ్డట్టు మన పరిస్థితి ఉండకూడదు. తెలంగాణ సంగతి ఏంది? మన కొంప సంగతి మనం చూసుకోవాలె. మన కొంప బాగుండాలంటే అధికారం మన చేతిలో ఉండాలె. ఏమరుపాటుగా ఉండకుండా రెండు ఓట్లు కూడా టీఆర్ఎస్కు వేయాలని మనవి జేసుకుంటున్న.. ఆంధ్ర ఎంపీలు 25 మంది ఉన్నరు. అదే మనకు ఎంపీలు 17 మందే ఉంటరు. అందుకని మన ఎంపీ స్థానాల్లో మనోళ్లనే గెలిపించుకోవాలి. ప్రాజెక్టులకు క్లియరెన్స్ రావాలంటే, నీళ్లు పారాలంటే కేంద్రమే క్లియరెన్స్ ఇవ్వాలె. మనకు ఎంపీల బలం ఉంటేనే కేంద్రం మెడలు వంచి మన నీళ్లు మనం తెచ్చుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.
ఆంధ్రోళ్ల డబ్బుతో కాంగ్రెస్ నేతలు..
ఆంధ్రా నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఆశీస్సులతో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ పదవిని తెచ్చుకున్నాడని కేసీఆర్ పేర్కొన్నారు. కేవీపీ రామచంద్రరావే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు సరఫరా చేస్తున్నాడని, ఆ ఆంధ్రోళ్ల డబ్బుతో గెలిచే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం నిలబడతరా? అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రోళ్లకు సద్ది కడతరా? మనోళ్లకు ఓటేస్తరా? దయచేసి ఆలోచన చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి దేశమంతటికీ ఎగుమతి చేస్తుందని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, డ్వాక్రా మహిళలకు రూ. 8 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని, రూ. 3 లక్షల వ్యయంతో ప్రతి పేదవానికి 125 గజాల జాగాలో పక్కా ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు అడ్డుకోవాలని చూసిండు..
‘‘చంద్రబాబునాయుడు మెడలు పట్టి నూకినా తెలంగాణ వదిలిపోడట.. ఆత్మగౌరవం లేని వాళ్ల వల్లనే తెలంగాణలో ఇంకా ఆంధ్ర పార్టీలు చలామణీ అవుతున్నయి. ఉద్యోగులకు ఆప్షన్లు, పోలవరం వంటి వాటి మీద చంద్రబాబు మాట్లాడాలే. టీఆర్ఎస్ను ఓడించటానికి చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కుట్రలు చేస్తున్నరు. తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి కూడా ఈ ఇద్దరే చివరిదాకా పోరాడారు. బీజేపీ-టీడీపీ పొత్తుల మధ్య భయంకరమైన కుట్ర ఉంది. కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా సెటిలర్ల ఓట్లు కోసం పాకులాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కొత్త సంసారం.. ఆగం చేసుకోవద్దు
Published Sat, Apr 19 2014 1:32 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement