‘ రామచరితమానస్’ గ్రంథ రచయిత? | Modern human ancestors found in the nearby ancient humans | Sakshi
Sakshi News home page

‘ రామచరితమానస్’ గ్రంథ రచయిత?

Jun 10 2014 10:19 PM | Updated on Jul 11 2019 5:01 PM

ఆధునిక మానవునికి సమీప పూర్వీకులుగా గుర్తించిన ప్రాచీన మానవులు

 చరిత్ర
 1.    ఆధునిక మానవునికి సమీప పూర్వీకులుగా గుర్తించిన ప్రాచీన మానవులు?
     హోమోసెఫియన్‌‌స
 
 2.    చైనాలో అతిపెద్దనది ఏది?
     హోయాంగ్‌హో    
 
 3.    కాగితాన్ని కనిపెట్టినవారెవరు?
     చైనీయులు    
 
 4.    మొఘల్ సామ్రాజ్య స్థాపకుడెవరు?
     బాబర్    
 
 5.    ‘రామచరితమానస్’ గ్రంథ రచయిత?
     తులసీదాస్    
 
 6.    ‘ఉదయించే సూర్యుడి భూమి’గా పేరు పొందిన దేశమేది?
     జపాన్    
 
 7.    {పసిద్ధి చెందిన ‘మోనాలిసా’ చిత్రాన్ని వేసినవారు?
     లియోనార్‌‌డ డావిన్సీ    
 
 8.    యూదుల పవిత్ర ప్రదేశమేది?
     జెరూసలేం    
 
 9.    అమెరికాను కనుగొన్నవారెవరు?
     అమెరిగో విస్పూచి (ఇటాలియన్)    
 
 10.    భూమి, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మొదటగా ప్రతిపాదించినవారు?
     కోపర్నికస్    
 
 11.    దాస్‌కాపిటల్, కమ్యూనిస్ట్ మెనిఫెస్టో అనే రచనలు చేసినవారు?
     కారల్‌మార్‌‌క్స    
 
 12.    ‘మెయిన్‌కాంఫ్’ గ్రంథ రచయిత?
     హిట్లర్    
 
 13.    అలీనోద్యమ రూపశిల్పి?
     జవహర్ లాల్ నెహ్రూ    
 
 14.    సింధులోయ నాగరికతకు చెందిన ‘మహా స్నానవాటిక’ ఎక్కడ బయట పడింది?     
    మొహంజోదారో
 
 15.    వేదాలు ఎన్ని?
     4 (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)    
 
 16.    ‘మహాబలిపురం’ను నిర్మించినవారు?
     పల్లవ నరసింహవర్మ    
 
 17.    దేశంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది?
     చిదంబరం (తమిళనాడు)    
 
 18.    విఠలస్వామి, హజరా రామస్వామి ఆలయా లను నిర్మించిన రాజు?
     } కృష్ణదేవరాయలు    
 
 19.    తాజ్‌మహల్, ఎర్రకోటను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
     షాజహాన్    
 
 20.    గణపతి, శివాజీ ఉత్సవాలను మొదటగా నిర్వహించినవారు?
     బాలగంగాధర్ తిలక్    
 
 21.    ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
     {Mీ.శ. 1757    
 
 22.    సతీసహగమన దురాచారాన్ని నిషేధించిన బ్రిటిష్  అధికారి?
     విలియం బెంటింక్    
 
 23.    1857 సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది?
     మీరట్    
 
 24.    ‘అమృతబజార్ పత్రిక’ సంపాదకులు?
     శిశిర్‌కుమార్ ఘోష్    
 
 25.    ‘ది హిందూ’ పత్రిక ఎవరి సంపాద కత్వంలో ప్రారంభమైంది?
     సుబ్రమణ్య అయ్యర్
 
 26.    తిలక్ సంపాదకత్వంలో ప్రారంభమైన పత్రి కలేవి?
     కేసరి, మరాఠా    
 
 27.    పుణేసార్వజనిక సభను నిర్వహించిన వారెవరు?
     మహదేవ్ గోవింద రనడే
 
 28.    మద్రాస్ మహాజన సభను స్థాపించిన వారు?
     రాఘవాచారి, సుబ్రమణ్య అయ్యర్
 
 29.    ‘భారత జాతీయ కాంగ్రెస్’ (1885) ఏర్పాటుకు కృషి చేసినవారు?
     ఎ.ఒ. హ్యూమ్    
 
 30.    మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు?
     డబ్ల్యూసీ బెనర్జీ
 
 31.    మితవాద యుగం అని దేన్ని పిలుస్తారు?
     1885 నుంచి 1905 వరకు    
 
 32.    వందేమాతర ఉద్యమం (1905) ప్రారంభమవడానికి కారణమేమిటి?
     లార్‌‌డ కర్జన్ బెంగాల్‌ను విభజించడం
 
 33.    ‘వందేమాతరం’  నినాదం ‘మదర్ లాండ్’  గ్రంథంలోని గేయంలోది. దీన్ని రాసినవారు?
     బంకించంద్ర చటర్జీ    
 
 34.    వందేమాతరం ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతం లో ప్రచారం చేసిన జాతీయ నాయకుడు?
     బిపిన్ చంద్రపాల్
 
 35.    మద్రాస్‌లో ‘హోంరూల్‌లీగ్’ను (1915) ప్రారంభించినవారు?
     అనిబీసెంట్    
 
 36.    మహాత్మాగాంధీ ఎక్కడ జన్మించారు?
     పోర్‌బందర్, గుజరాత్ (1869)    
 
 37.    గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన సంవత్సరం?
     1915    
 
 38.    భారతదేశంలో గాంధీజీ మొదటగా ఎక్కడ జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు?
     చంపారన్, బీహార్ (1917)
 
 39.    అమృత్‌సర్‌లో జలియన్  వాలాబాగ్ ఉదంతం  ఎప్పుడు జరిగింది?
     1919 ఏప్రిల్, 13
 
 40.    గాంధీజీ ఏ సంఘటనను తీవ్రంగా భావించి 1922లో సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు?
     చౌరీ చౌరా సంఘటన (ఉత్తరప్రదేశ్)    
 
 41.    స్వరాజ్య పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు?
     చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూ    
 
 42.    పూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యమని ఎవరి అధ్య క్షతన జరిగిన సమావేశంలో నిర్ణ యించారు?
     జవహర్ లాల్ నెహ్రూ    
 
 43.    గాంధీజీ ‘దండియాత్ర’తో (1930) ప్రారం భించిన ఉద్యమం?
     శాసనోల్లంఘనోద్యమం    
 
 44.    మొదటి ‘ఆల్ ఇండియా ఖిలాఫత్ డే’ను ఏ రోజున జరుపుకున్నారు?
     అక్టోబరు, 17    
 
 45.    మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
     కేరళ    
 
 46.    లక్నో ఒడంబడిక (1916) ఎవరెవరి మధ్య జరిగింది?
     భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్    
 
 47.    ‘జాతిని అవమానించిన రోజు’గా నిర్వ హించాలని గాంధీజీ నిర్ణయించడానికి కారణం?
     రౌలత్ చట్టం    
 
 48.    గాంధీజీ ఏ రోజును ‘జాతిని అవమానించిన రోజు’గా పాటించాలని పిలుపునిచ్చారు?
     1919 ఏప్రిల్, 6
 
 49.    ‘పుణే ఒడంబడిక’ ఎవరెవరి మధ్య జరిగింది?
     గాంధీ, అంబేద్కర్    
 
 50.    క్విట్ ఇండియా ఉద్యమం (1942) సంద ర్భంగా గాంధీజీ ఇచ్చిన నినాదమేమిటి?
     డూ ఆర్ డై (సాధించు లేదా మరణించు)    
 
 51.    భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టిన నావికుడు?
     వాస్కోడిగామా    
 
 52.    వాస్కోడిగామాను తన రాజ్యంలోకి ఆహ్వా నించిన భారతీయ ప్రాంతీయ రాజు?
     జామోరిన్    
 
 53.    బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం?
     1764    
 
 54.    భారతీయులు నమ్మదగినవారు కాదనే అభిప్రాయమున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్?
     కారన్‌వాలీస్
 
 55.    శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి?
     కారన్‌వాలీస్
 
 56.    వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని మెదటిసారిగా అంగీకరించినవారు?
      హైదరాబాద్ నిజాం    
 
 57.    మహిళా విద్య, భారతీయ భాషలను ప్రోత్సహించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్?
      డల్హౌసీ    
 
 58.    రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రూపొందిం చిందెవరు?
     డల్హౌసీ    
 
 59.    {బహ్మసమాజాన్ని స్థాపించినవారు?
     రాజారామ్మోహన్ రాయ్    
 
 60.    ఆంధ్రాలో బ్రహ్మసమాజ వ్యాప్తికి కృషి చేసినవారెవరు?
     కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు
     
 61.    ‘ఆర్యసమాజం’ రూపకర్త?
     స్వామి దయానంద సరస్వతి    
 
 62.    అలీఘర్ ఉద్యమ నాయకుడు?
     సయ్యద్ అహ్మద్‌ఖాన్    
 
 63.    వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించిన వారు?
     ఈశ్వర చంద్ర విద్యాసాగర్    
 
 64.    ఏసియాటిక్ సొసైటీని స్థాపించినవారు?
     విలియం జోన్‌‌స    
 
 65.    అభిజ్ఞాన శాకుంతలం (కాళిదాస్ రచన)ను ఆంగ్లంలోకి అనువదించినవారు?
     విలియం జోన్‌‌స    
 
 66.    ముస్లింలీగ్ (1906) ఏర్పాటుకు ప్రోత్సా హాన్ని అందించిన బ్రిటిష్ అధికారి?
     వైశ్రాయ్ మింటో    
 
 67.    హోంరూల్ ఉద్యమకాలంలో ‘స్వరాజ్యమే నా జన్మహక్కు’ అని నినదించినవారు?
     తిలక్    
 
 68.    గాంధీజీ రూపొందించిన నూతన విద్యా విధానం పేరు?
      బేసిక్ విద్య    
 
 69.    మొట్టమొదటి వ్యక్తి సత్యాగ్రహి ఎవరు?
     ఆచార్య వినోబా భావే    
 
 70.    ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపకుడెవరు?
     సుభాష్ చంద్రబోస్    
 
 71.    సింధులోయ నాగరికతను ఎప్పుడు జరిపిన తవ్వకాల్లో మొదటగా కనుగొన్నారు?
     1921-22    
 
 72.    సింధులోయ నాగరికత ఏ కాలంలో విలసిల్లింది?
     {Mీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు    
 
 73.    హరప్పా నగరం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
     మాంటీగోయరి జిల్లా, పంజాబ్    
 
 74.    సింధు నాగరికత విశిష్ట లక్షణం?
     పట్టణ స్వభావం        
 
 75.    వేద సాహిత్య సృష్టికర్తలు?
     ఆర్యులు    
 
 76.    కనిష్కుడి కాలంలోని శిల్పకళ ఏది?
     గాంధారకళ (గ్రీకో - బౌద్ధమత కళ)
     
 77.    జైనమతంతో ప్రేరణ పొందిన కళ?
     మధురకళ    
 
 78.    భితర్‌గావ్ ఇటుకల ఆలయం ఏ రాష్ర్టంలో ఉంది?
      ఉత్తరప్రదేశ్    
 
 79.    బృహదీశ్వరాలయం (తంజావూర్)ను ని ర్మించిన వారు?
     రాజరాజ చోళుడు    
 
 80.    గంగైకొండ చోళపుర నిర్మాత?
     రాజేంద్ర చోళుడు    
 
 81.    ఢిల్లీ సుల్తాన్‌ల వాస్తు, శిల్ప శైలిని ఏమంటారు?
     ఇండో - సర్ సేనిక్ శైలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement