డీవైఎఫ్‌ఐ మహాసభలను విజయవంతం చేయాలి | we will sucuss DYFI meetings | Sakshi
Sakshi News home page

డీవైఎఫ్‌ఐ మహాసభలను విజయవంతం చేయాలి

Jul 26 2016 12:09 AM | Updated on Sep 4 2017 6:14 AM

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు షేక్‌ ఖాదర్‌ కోరారు.

మునగాల:  భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని   ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు షేక్‌ ఖాదర్‌  కోరారు. ఈ సమావేశాన్ని పట్టణంలో ఆగస్టు తొలి వారంలో నిర్వహిస్తామన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో జరిగిన  ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువజనోద్యమాల సారథి, ఐక్యపోరాటాల వారధి డీవైఎఫ్‌ఐ తొలి రాష్ట్ర మహాసభలకు చారిత్రాత్మక పోరాటాల పురిటిగడ్డ కోదాడ పట్టణం వేదిక కానున్నదని వివరించారు. ఈ తొలి రాష్ట్ర మహాసభల ఏర్పాటుకై  బుధవారం  కోదాడలో జరిగే సన్నాహాక సమావేశంలో మండలం నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఖాదర్‌ పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement