అంగన్‌వాడీ కేంద్రంలోకి నాగుపాము | snake came in anganwadi centre | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలోకి నాగుపాము

Aug 6 2016 9:45 AM | Updated on Sep 4 2017 7:59 AM

మండలంలోని కొండుకూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలోకి శుక్రవారం మధ్యాహ్నం పాము రావడంతో చిన్నారులు భయంతో వణికిపోయారు.

భయంతో వణికిపోయిన చిన్నారులు

కడెం : మండలంలోని కొండుకూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలోకి శుక్రవారం మధ్యాహ్నం పాము రావడంతో చిన్నారులు భయంతో వణికిపోయారు. కేంద్రంలో పిల్లలు కూర్చుండే హాలులో ఒక మూలన సరుకులు, కోడిగుడ్లు, బియ్యం, పప్పులు ఇతర సామగ్రి ఉంచారు. వాటి పక్క నుంచే ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది.

ఆ సమయంలో కార్యకర్త గంగామణి లేదు. విధుల్లో ఉన్న ఆయా లక్ష్మి వెంటనే పిల్లలను దూరం వెళ్లమని చెప్పి భయాందోళనతో బయటకు వెళ్లి కేకలు వేసింది. దీన్ని చూసిన అదే గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ పి. సంతోష్‌రెడ్డి వెంటనే అక్కడి చేరుకుని ఆ పామును చంపించారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. కేంద్రం పనితీరు అస్తవ్యస్తంగా తయారైందనాటికి ఈ ఘటనే నిదర్శనం.

Advertisement
 
Advertisement
Advertisement