కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా | SFI protest in front of the Collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Sep 1 2016 12:29 AM | Updated on Sep 4 2017 11:44 AM

సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనిడిమాండ్‌ చేస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా కమిటీ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. జో రువానలో హన్మకొండ బాలసముంద్రంలోని ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.

హన్మకొండ అర్బన్‌ : సంక్షేమ హాస్టళ్లలో ని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనిడిమాండ్‌ చేస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా కమిటీ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. జో రువానలో హన్మకొండ బాలసముంద్రంలోని ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థుల మెస్‌ చార్జీలు రూ.1500, కాస్మోటిక్‌ చార్జీలు రూ.350 చెల్లించాలని విద్యార్థి నాయకులు కోరారు. పెండింగ్‌ ఫీజులు విడుదల చేయాలని, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అ««దl్యక్ష, కార్యదర్శులు హన్మకొండ శ్రీధర్, చిలువేరు శ్రీకాంత్, అంజలి, రవళి, ప్రవళిక, దేవేందర్, కిరణ్, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement