బీన్యూలో సంక్రాంతి ఆఫర్లు | sankranthi offers in Bnew | Sakshi
Sakshi News home page

బీన్యూలో సంక్రాంతి ఆఫర్లు

Jan 13 2017 10:48 PM | Updated on Jul 6 2018 3:32 PM

అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ-న్యూ సంస్థ సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ వై.డి. బాలాజీ చౌదరి తెలిపారు.

అనంతపురం : అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ-న్యూ సంస్థ సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ వై.డి. బాలాజీ చౌదరి తెలిపారు. ఈమేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తమ బ్యాంకింగ్‌  లావాదేవీలను జరిపేందుకు వీలుగా తక్కువ ధరకు వివిధ మోడళ్ల సెల్‌ ఫోన్లను బీ-న్యూ సంస్థ అందుబాటులో ఉంచిందన్నారు. పలు మోడళ్ల ఫోన్లకు బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా నెలవారీ చెల్లించే సదుపాయం ఉందన్నారు.

అంతేకాక అన్ని రకాల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రూ.699కే డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే లంచ్‌బాక్స్‌, రూ.999 డ్యూయల్‌సిమ్‌ ఫోన్‌తో ట్రావెల్‌ బ్యాగ్‌, రూ.1399కు సెల్‌ఫోన్‌తోపాటు టేబుల్‌ ఫ్యాన్‌, రూ.4499కే 4జీ టెక్నాలజీ కలిగిన సెల్‌ఫోన్‌కు జియో సిమ్‌ అందిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా అందిస్తున్న ఈ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన ఆప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement