కోటి విలువజేసే ఎర్రచందనం పట్టివేత | Police seizes red sandalwood logs, 7 busted | Sakshi
Sakshi News home page

కోటి విలువజేసే ఎర్రచందనం పట్టివేత

Nov 6 2016 7:28 PM | Updated on Sep 4 2017 7:23 PM

కోటి విలువజేసే ఎర్రచందనం పట్టివేత

కోటి విలువజేసే ఎర్రచందనం పట్టివేత

జిల్లాలోని సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద పోలీసులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద పోలీసులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కసారిగా ఎర్రచందనం స్మగ్లర్లపై దాడి చేశారు. కాగా, ఈ దాడిలో కోటి రూపాయలు విలువజేసే ఎర్రచందనం దుంగలను, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏడుగురు కూలీలను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో 30 మంది తమిళ కూలీలు తప్పించుకు పారిపోయినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement