కేశన్న గౌడ్‌ అరెస్టు | keshanna goud arrest | Sakshi
Sakshi News home page

కేశన్న గౌడ్‌ అరెస్టు

Mar 28 2017 11:07 PM | Updated on Oct 16 2018 6:33 PM

కేశన్న గౌడ్‌ అరెస్టు - Sakshi

కేశన్న గౌడ్‌ అరెస్టు

డోన్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద వేలం పాటల సందర్భంగా గత శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడి చేసిన కేసులో టీడీపీకీ చెందిన డోన్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కేశన్నగౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

డోన్‌ టౌన్‌: డోన్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద వేలం పాటల సందర్భంగా గత శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడి చేసిన కేసులో టీడీపీకీ చెందిన డోన్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కేశన్నగౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం రిలయన్స్‌ డాబా వద్ద ఉన్న అతనితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు గౌడ్‌ తెలిపారు. దాడి కేసులో కేశన్న గౌడ్‌తో పాటు 20 మంది నిందితులుండగా ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నామన్నారు. కేశన్నగౌడ్‌తో పాటు జగదీశ్, మద్దిలేటి, మహేష్‌గౌడ్, నాగార్జున, రూపక్‌ కుమార్, శ్రీనివాసరెడ్డిని మీడియా ఎదుట హాజరుపరిచారు. అనారోగ్య కారణాలతో కేశన్నగౌడ్‌ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పోలిసులు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement