మీరు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాను... ఓడిపోతే... | katti padma rao takes on chandrababu | Sakshi
Sakshi News home page

మీరు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాను... ఓడిపోతే...

Feb 11 2016 2:53 PM | Updated on Jul 28 2018 3:23 PM

మీరు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాను... ఓడిపోతే... - Sakshi

మీరు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాను... ఓడిపోతే...

నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడికి దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు సవాల్ విసిరారు.

గుంటూరు : నవ్యాంధ్ర రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడికి దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు సవాల్ విసిరారు. గురువారం గుంటూరులో కత్తి పద్మారావు మాట్లాడుతూ.... ఈ చర్చలో మీరు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాను... అలాగే ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా ? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

నవ్యాంధ్ర రాష్ట్రంలో కులవివక్ష చూపుతోంది మీరు కాదా అని ఆయన్ని కత్తి పద్మారావు ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రూపొందించిన బి.ఆర్.అంబేద్కర్ పుట్టిన కులంలో తాము పుట్టినందుకు గర్విస్తున్నామని కత్తిపద్మారావు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు దళితులను అవమానించినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement