తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు | full rains in telangana, kostandhra | Sakshi
Sakshi News home page

తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Jun 26 2016 3:38 PM | Updated on Sep 4 2017 3:28 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

రాయలసీమలో మాత్రం ఓ మోస్తరుగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement