‘చిలకమ్మ’కు గిరాకీ లేదు..! | Devotees Interest in parrots are gegraded | Sakshi
Sakshi News home page

‘చిలకమ్మ’కు గిరాకీ లేదు..!

Jul 19 2015 11:39 AM | Updated on Aug 1 2018 5:04 PM

‘చిలకమ్మ’కు గిరాకీ లేదు..! - Sakshi

‘చిలకమ్మ’కు గిరాకీ లేదు..!

చిలుక ముక్కున కరుచుకుని పక్కన పెట్టే కార్డులో రాసి ఉన్న దాన్నిబట్టి చిలక జ్యోతిష్కులు మన జాతకాన్ని గడగడా చెప్పేస్తారు.

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : చిలుక ముక్కున కరుచుకుని పక్కన పెట్టే కార్డులో రాసి ఉన్న దాన్నిబట్టి చిలక జ్యోతిష్కులు మన జాతకాన్ని గడగడా చెప్పేస్తారు. ఇది నిజమని నమ్మినా, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న కుతూహలాన్ని తీర్చుకునే చిరుసరదా అనుకున్నా.. అయితే ప్రస్తుతం పుష్కరాల్లో చిలక జ్యోతిష్కుల జాతకం ఏమంత బాగాలేదన్నది నిజం. ఆకలేసిన చిలుక జామకాయ కోసం ఆరాటపడ్డట్టు.. రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లోని ఈ చిలక జ్యోతిష్కుల వారు జాతకం చెప్పించుకునే వారి కోసం నిరీక్షిస్తున్నారు. కంప్యూటర్ జ్యోతిష్కాల కాలం కదా.. చిలుక ముక్కుతో కార్డును తీయించడం కాక.. కీ బోర్డును ఆపరేట్ చేయించి, జాతకం చెప్పిస్తే గిరాకీ పెరుగుతుందేమో!

Advertisement
 
Advertisement
Advertisement