విడాకుల పంచాయితీకి రండి! | cards distribution for divorce settlement in warangal district | Sakshi
Sakshi News home page

విడాకుల పంచాయితీకి రండి!

Feb 9 2016 3:51 AM | Updated on Sep 28 2018 4:32 PM

విడాకుల పంచాయితీకి రండి! - Sakshi

విడాకుల పంచాయితీకి రండి!

భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించిన ఓ ప్రబుద్ధుడు... ఆహ్వానం సినిమాలో మాదిరిగా ఇంటింటికి తిరిగి తమ విడాకుల పంచాయతీకి రావాలంటూ ఆహ్వాన పత్రికలు

భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించిన ఓ ప్రబుద్ధుడు.. ఆహ్వానం సినిమాలోలా ఇంటింటికీ తిరిగి తమ విడాకుల పంచాయితీకి రావాలంటూ వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో సోమవారం ఆహ్వాన పత్రికలు పంచాడు. నారాయణగిరికి చెందిన ముత్తోజు వెంకట్రాజం, రాజమణి దంపతుల కుమార్తె ఉమకు నాలుగున్నర సంవత్సరాల క్రితం దుగ్గొండికి చెందిన కలకొండ సురేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ పాప.  మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడిన సురేష్ ఆమెను పుట్టింటికి పంపించాడు.

బావమరిది రమేష్‌తోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సురేష్ మరో ఐదుగురితో కలిసి నారాయణగిరికి వచ్చి ఈ నెల 14న జరిగే ‘విడాకుల పంచాయితీకి ఆహ్వానం’ అని ముద్రించిన కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని పట్టుకోగా, సురేష్ తప్పించుకున్నాడు. మిగితా ఐదుగురిని ఆరా తీయగా తమకు చదువురాదని, రూ. 300 కూలి ఇస్తామంటే వచ్చి  కరపత్రాలు పంచుతున్నామని తెలిపారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి ఉమ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.                                   
- ధర్మసాగర్

Advertisement
 
Advertisement
Advertisement