కర్నూలులో బల్లాలదేవ | balladeva at kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో బల్లాలదేవ

Jan 7 2017 10:28 PM | Updated on Sep 5 2017 12:41 AM

కర్నూలులో బల్లాలదేవ

కర్నూలులో బల్లాలదేవ

బాహుబలి ఫేం బల్లాలదేవ (దగ్గుబాటిరానా) కర్నూలుకు వచ్చాడు.

 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బాహుబలి ఫేం బల్లాలదేవ (దగ్గుబాటిరానా) కర్నూలుకు వచ్చాడు. తేజా దర్శకత్వంలో దగ్గుబాటి సురేష్‌ నిర్మాతగా సురేష్‌ ప్రొడక‌్షన్స్‌లో రాయలసీమ కథ ఆధారంగా తీస్తున్న  సినిమా షూటింగ్‌ శనివారం కొండారెడ్డి బురుజు పరిసరా ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో హీరోలుగా రానాతోపాటు నవదీప్‌ నటిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో  షూటింగ్‌ చేసుకుని కర్నూలుకు వచ్చినట్లు దర్శకుడు తెలిపారు.  
 
హీరోలకు సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ ఆల్బమ్‌ అందజేత
సినిమా షూటింగ్‌ కోసం కర్నూలుకు వచ్చిన హీరోలు రానా, నవదీప్‌లకు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తాను స్వయంగా పాడిన సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ ఆల్బమ్‌ సీడిని అందజేశారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే పాటలు పాడిన ఎస్పీని వారు అభినందించారు. ఆడ పిల్లల రక్షణకు  సేవ్‌గర్ల్‌ పాట ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement