పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం | 873.10 water level at pothireddypadu | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం

Sep 21 2016 7:32 PM | Updated on Aug 1 2018 4:01 PM

పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం - Sakshi

పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం

పోతిరెడ్డిపాడు వద్ద 873.10అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు.

పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు వద్ద 873.10అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి 16వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా శ్రీశైలం జలాశయంలో 874.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్సారెమ్సీ కాల్వలోకి 2,000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా హంద్రీనీవా సుజలశ్రవంతి పథకం ద్వారా 1680క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,000క్యూసెక్కులు, కేసీ కాల్వకు 500, ఎస్సార్బీసీకి 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్‌ తెలిపారు. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తిచేస్తూ 7,416 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు గేజింగ్‌ అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement