సింపుల్‌గా చోరీ.. జాగ్రత్త! | Thief Steal Handbag With Stick From House in Mayapur | Sakshi
Sakshi News home page

‘దొంగ’ తెలివి!

Feb 12 2020 10:30 AM | Updated on Feb 12 2020 10:30 AM

Thief Steal Handbag With Stick From House in Mayapur - Sakshi

చోరీకి వాడిన కర్ర, పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్, డీఐ మహేష్‌

అర్ధరాత్రి కుటుంబీకులంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటి కిటికీలోంచి చోరీ చేశాడో దొంగ.

సాక్షి, హైదరాబాద్‌‌: అర్ధరాత్రి కుటుంబీకులంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటి కిటికీలోంచి కర్రతో హ్యాండ్‌ బ్యాగ్‌ను తస్కరించి అందులో ఉన్న రూ.15 వేల నగదును కాజేసి ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు.. మియాపూర్‌ జేపీఎన్‌ నగర్‌లోని ప్లాట్‌ నంబర్‌ 242లో రవి అనే ఫొటోగ్రాఫర్‌ అద్దెకు ఉంటున్నాడు. (చదవండి: 20 రోజులు.. 2 సార్లు.. రూ.2.2 లక్షలు!)

సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్లాట్‌లోని ఇంటి గేటు పైనుంచి దూకిన దొంగ.. ఇంటి వెనక కిటికీ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న కర్రను తీసుకొని చివరి భాగంలో ఇనుప వైరును కొక్కెంగా చేసి బిగించాడు. దాని సహాయంతో కిటికిలో నుంచి గోడకు తగిలించిన హ్యాండ్‌ బ్యాగ్‌ను తస్కరించాడు. అందులో ఉన్న రూ.15 వేలు తీసుకుని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్, డీఐ మహేష్, ఎస్‌ఐ ప్రసాద్‌లు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం)

Advertisement
 
Advertisement
Advertisement