జర్నలిస్టుపై దాడి, నోట్లో మూత్రం పోసి : వీడియో వైరల్‌ | Government Railway Police Inspector Rakesh Kumar thrashed News 24 journalist | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై దాడి, నోట్లో మూత్రం పోసి : వీడియో వైరల్‌

Jun 12 2019 9:17 AM | Updated on Jun 12 2019 10:30 AM

Government Railway Police Inspector Rakesh Kumar thrashed News 24 journalist - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగడాలకు సంబంధించిన మరో  దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.  ప్రభుత్వ అధికారి ఓ పాత్రికేయుడిపై అమానుషంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది. రైలులో అనధికారిక  వ్యాపారుల (హాకర్స్‌) పై కథనాన్ని ప్రచురించినందుకు గాను  రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రాకేష్ కుమార్  జర్నలిస్టు అమిత్‌శర్మపై  దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి.   దీంతో  పలు విమర‍్శలు వెల్లువెత్తాయి. 

తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని జర్నలిస్టు వాపోయారు.  అంతేకాదు లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు. మరోవైపు  ఈ ఘటనకు సంబంధించిన  వీడియో విరివిగా షేర్‌ అవుతూ వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారి రాకేష్‌కుమార్‌తోపాటు మరో  రైల్వే కానిస్టేబుల్‌ సునీల్‌ కుమార్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement