ఇజ్రాయెల్ సంస్థలో వాటా కొన్న విప్రో | Wipro picks up minority stake in Israeli firm for $ 1.5 m | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ సంస్థలో వాటా కొన్న విప్రో

Aug 19 2016 1:31 AM | Updated on Sep 4 2017 9:50 AM

ఇజ్రాయెల్ సంస్థలో వాటా కొన్న విప్రో

ఇజ్రాయెల్ సంస్థలో వాటా కొన్న విప్రో

ఐటీ దిగ్గజం విప్రో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఇటీవలే పలు కంపెనీల్లో వాటాను చేజిక్కించుకున్న ...

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఇటీవలే పలు కంపెనీల్లో వాటాను చేజిక్కించుకున్న  ఈ కంపెనీ తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ... ఇన్‌సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్‌లో మైనారిటీ వాటాను  కొనుగోలుచేసింది. ఇన్‌సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలో 20 శాతం కంటే తక్కువ వాటాను 15 లక్షల డాలర్లతో కొనుగోలు చేశామని విప్రో తెలిపింది. గతేడాదే ప్రారంభమైన ఇన్‌సైట్స్ కంపెనీ టెల్ అవీవ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ కొనుగోలు లావాదేవీ ఈ నెల చివరికల్లా పూర్తవగలదని వివరించింది. కాగా విప్రో కంపెనీ ఇటీవల కాలం ఓ హెల్త్‌ప్లాన్ సర్వీసెస్, సెలెంట్, వీటియోస్ గ్రూప్ తదితర కంపెనీల్లో చెప్పుకోదగ్గ వాటాలను కొనుగోలు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement