విస్తారా పండుగ సేల్‌: 48 గంటలే..

Vistara offers flight tickets from  Rs.1199 in new flash sale - Sakshi

విస్తారా ఫెస్టివ్‌ సీజన్‌  సేల్‌

ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌ టికెట్లపై ఆఫర్‌ సేల్‌

జమ్మూ-శ్రీనగర్‌ ఎకానమీ క్లాస్ టికెట్‌  రూ.1199 లకే

సాక్షి, న్యూఢిల్లీ:  విస్తారా  విమానయాన సంస్థ దీపావళి పండుగ సేల్‌ను ప్రకటించింది. దేశీయ నెట్ వర్క్‌లో 48 గంటల సేల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ రోజు (అక్టోబర్‌ 10వ తేదీ, గురువారం) నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు  ఈ డిస్కౌంట్‌ సేల్‌ అందుబాటులో ఉంటుంది. అంటే 48 గంటలు మాత్రమే ఈ  సేల్‌ లభ్యమవుతుంది.  

ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్‌ ఆఫర్‌ వర్తిస్తుందని  కంపెనీ తెలిపింది. ప్రధాన మార్గాల్లో ఢిల్లీ - ముంబై, ముంబై - బెంగళూరు, ముంబై - గోవా, ఢిల్లీ - చెన్నై, ఢిల్లీ - బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోద్‌పూర్, ఉదయ్‌పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తిస్తుంది. ప్రధానంగా జమ్మూ-శ్రీనగర్‌ మార్గంలో1199 లకే(ఎకానమీ క్లాస్‌) టికెట్‌ ను అందిస్తోంది.  వివిధ మార్గాల్లో ప్రీమియం ఎకానమీ  రూ. 6 2,699 ,  బిజినెస్ క్లాస్ టికెట్‌ రూ. 6,999 నుంచి ప్రారంభం.  ఈ ఆఫర్‌లో ఎన్ని టికెట్లను ఆఫర్‌ చేస్తున్నదీ కంపెనీ ప్రకటించలేదు గానీ, ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ కింద టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. 

ఈ ఆఫర్‌లో  టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. పండుగ సీజన్‌ను మరింత ఆనందంగా మలించేందుకు, అలాగే తమ వ్యాపార అభివృద్ధికి  ఈ డిస్కౌంట్‌ సేల్‌ దోహదం చేస్తుందన్న విశ్వాసాన్ని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్  వ్యక్తం చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top