అమ్మకాలు పోటు : భారీ నష్టాలు

Sensex tanks over 250 pts - Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్‌లో నేడు చోటు చేసుకున్న అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌281 పాయింట్ల మేర క్షీణించి 33,033 వద్ద, నిఫ్టీ 96.80 పాయింట్ల నష్టంలో 10,224 వద్ద ముగిశాయి. మిడ్ సెషన్‌ నుంచీ పెరిగిన అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోయాయి.

ఆర్‌కామ్‌ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. ఈ కంపెనీ షేర్లు 12.81 శాతం మేర నష్టాలు గడించాయి. రెండు సూచీల్లోనూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, మహింద్రా అండ్‌ మహింద్రాలు టాప్‌ గెయినర్లుగా లాభాలు పండించగా.. అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ, అరబిందో ఫార్మాలు నష్టాలు పాలయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top