రెడ్‌మికి ఝలక్‌ : 'రియల్‌మీ యో డేస్' సేల్ 

Realme Yo Days Sale  - Sakshi

సాక్షి,ముంబై  : చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో  సబ్‌బ్రాండ్‌ రియల్‌మి మరోసారి డిస్కౌంట్లకు ఆఫర్లకు  తెర తీసింది. స్మార్ట్‌ఫోన్లపై  తగ్గింపు  ధరలతో 'రియల్‌మీ యో డేస్' సేల్ మరోసారి  ప్రకటించింది.  ఏప్రిల్ 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు  ఈ సేల్ జరగనుంది.  ఇందులో  ఆకర్షణీమైన ఆఫర్లతో  వినియోగదారులను  ఆకర్షిస్తోంది. రియల్‌మీ 2 ప్రొ, రియల్‌ మి యూ1 తదితర స్మార్ట్‌ఫోన్లను  తగ్గింపు ధరలతో   అందిస్తోంది.  

రియల్‌మీ 2 ప్రో (4జీబీ+64జీబీ) స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపుతో ధర రూ.11,990 లకే లభించనుంది. దీని  అసలు ధర రూ.12990
6జీబీ+64జీబీ ధర రూ.14,990గా ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 10 ఉదయం 11 గంటలకు రియల్‌మీ 2 ప్రో  కొనుగోలుపై రియల్‌మీ బడ్స్ ఉచితంగా అందివ్వనుంది.

రియల్‌మీ యూ1 (3జీబీ+32జీబీ) ఫోన్‌పై రూ.1,000  డిస్కౌంట్‌తో  రూ.9,999 కి  లభ్యం. 
3జీబీ+64జీబీ వేరియంట్ ధర,రూ.10,999
4జీబీ+64జీబీ  వేరియంట్‌ ధర రూ.11,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.  
 8జీబీ ర్యామ్‌ స్మార్ట్‌ఫోన్‌ను  రూ.15990లకే అందిస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. 

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌,  రియల్‌ మి వెబ్‌సైట్‌ద్వారా ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. అంతేకాదు రియల్‌ 3 ని రియల్‌మీ యో డే  సేల్‌లో విక్రయించనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top