నేడు, రేపు ‘పశ్చిమ’లో వైఎస్సార్ జనభేరి | YS Jagan Mohan Reddy Jana Bheri in west godavari District | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ‘పశ్చిమ’లో వైఎస్సార్ జనభేరి

Mar 3 2014 3:32 AM | Updated on Aug 17 2018 8:19 PM

నేడు, రేపు ‘పశ్చిమ’లో వైఎస్సార్ జనభేరి - Sakshi

నేడు, రేపు ‘పశ్చిమ’లో వైఎస్సార్ జనభేరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

 ఏలూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జగన్ హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
 
అక్కడి నుంచి ఏలూరు వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30కి ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో వైఎస్సార్ జనభేరి బహిరంగ సభలో పాల్గొంటారు. 4వ తేదీ ఉదయం గోపాలపురం నియోజకవర్గంలో రోడ్‌షో చేపడతారు. అదేరోజు మధ్యాహ్నం 3.30కి నిడదవోలు గణేష్ చౌక్‌లో జనభేరి బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి జిల్లాలోనే బస చేసి మరుసటి రోజు ఉదయం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement