వాగులో చిక్కుకున్న యువకుడు | youth struck in floods of munner river | Sakshi
Sakshi News home page

వాగులో చిక్కుకున్న యువకుడు

Jun 21 2015 4:28 PM | Updated on Sep 3 2017 4:08 AM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరువాగు పొంగి పొర్లుతోంది. దీంతో పొలం పనులకు వెళ్లి వస్తూ యేసునాథ్ అనే యువకుడు మున్నేరువాగులో చిక్కుకున్నాడు

కృష్ణా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరువాగు పొంగి పొర్లుతోంది. దీంతో పొలం పనులకు వెళ్లి వస్తూ యేసునాథ్ అనే యువకుడు మున్నేరువాగులో చిక్కుకున్నాడు. పెనుగంచి ప్రోలు మండలం శెనగపాడు వద్ద వాగులో అతడు చిక్కిపోయాడు. దీంతో స్థానికులు అతడికి ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బోటును పంపి యేసునాథ్ను కాపాడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమైతే యేసునాథ్ ఉండే ప్రాంతం వరదతో నిండిపోయే ప్రమాదం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement