ఐదు రోజులే శీతాకాల సమావేశాలు  | Winter Sessions are five days only | Sakshi
Sakshi News home page

ఐదు రోజులే శీతాకాల సమావేశాలు 

Oct 18 2017 1:22 AM | Updated on Aug 18 2018 9:30 PM

Winter Sessions are five days only - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి మంగళవారం సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ ప్రకారం ఐదు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం వర్షాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని వాయిదా వేసి ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్ర జరిగే సమయంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించటం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement