తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక | Weather Forecast for Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Jul 10 2018 10:27 AM | Updated on Jul 10 2018 10:31 AM

Weather Forecast for Telugu States - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశా​ఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సాక్షి, విశాఖ: ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశా​ఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో  కోస్తాంధ్రలో చెదురుముదురు వానలు, రాయలసీమలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణం కేంద్రం వివరించింది.

దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45- 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తాయని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అంతే కాకుండా ఈనెల 13 నాటికి ఉత్తర బంగాలాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement