విన్సెంట్‌ ఫెర్రర్‌కు నివాళి | Sakshi
Sakshi News home page

విన్సెంట్‌ ఫెర్రర్‌కు నివాళి

Published Sun, Apr 9 2017 1:10 PM

tribute to the Vincent pherrar in anantapur

అనంతపురం: ఎక్కడో స్పెయిన్‌ దేశంలో పుట్టి.. కరవు సీమ అనంతపురం జిల్లాలో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు(ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ జయంతి వేడుకలు ఆదివారం ఉదయం  అనంతలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు వేలాది మంది తరలివచ్చారు.

ఫెర్రర్‌ కుటుంబసభ్యులతో పాటు సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, అనంత మేయర్‌ స్వరూపతో పాటు ఆర్డీటీలో పనిచేస్తున్న సిబ్బంది ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఏ స్వార్థం లేకుండా కేవలం పేదలకు సాయపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి సైతం సాధ్యపడని ఎన్నో కార్యక్రమాలను ఫెర్రర్‌ నిర్వహించడం నిజంగా అద్భుతమని నేతలు కొనియాడారు. ఫెర్రర్‌ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేలా అసెంబ్లీలో దీనిపై మాట్లాడతానని ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అన్నారు.

Advertisement
Advertisement