ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్‌ఎస్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్‌ఎస్‌

Published Wed, May 15 2024 9:40 AM

ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్‌ఎస్‌

మెట్‌పల్లిరూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ సహకరించిదని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మెట్‌పల్లి మండలం వేంపేటలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చతికిలబడడంతో ఆ పార్టీ కాంగ్రెస్‌పై ద్వేషం పెంచుకుందన్నారు. అయినా లక్షకుపైగా మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీలు ప్రభుత్వపరంగా ప్రారంభించడం సాధ్యంకాదని, సహకార రంగం నుంచి ప్రారంభిస్తామని అమిత్‌షా ప్రకటనతో రైతుల్లో ఆ పార్టీపై పూర్తిగా విముఖత ఏర్పడిందన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీల పునఃప్రారంభం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమనే నమ్మకం రైతుల్లో ఏర్పడిందన్నారు. త్వరలోనే అన్ని షుగర్‌ ఫ్యాక్టరీలు పునఃప్రారంభించి రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కృష్ణారావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు కరం, విజయ్‌అజాద్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌పై ద్వేషం పెంచుకున్న బీఆర్‌ఎస్‌..

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement