ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది వైఎస్: ఎంపీ అవినాష్ రెడ్డి

ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది వైఎస్: ఎంపీ అవినాష్ రెడ్డి

పైడిపాలెం రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పైడిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పైడిపాలెం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. 

 

అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలలో కరెంటు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వారి కరెంటు బిల్లులు చెల్లించి, ఆయా కాలనీలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరారు. అయితే ఇప్పటికే 50 యూనిట్ల వరకు వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పగా, కావాలంటే ఇప్పుడేప వెళ్లి చూసుకోవచ్చని.. ఆ కాలనీల్లో విద్యుత్ సరఫరా లేనే లేదని తెలిపారు. 
Back to Top