ఎస్సై గాల్లోకి కాల్పులు:ఇద్దరికి గాయాలు | sub inspector firing on air, two were injured | Sakshi
Sakshi News home page

ఎస్సై గాల్లోకి కాల్పులు:ఇద్దరికి గాయాలు

Jan 3 2014 8:57 PM | Updated on Oct 20 2018 6:17 PM

జిల్లాలోని బంగారుపాళ్యంలో ఎస్పై గాల్లోకి కాల్పులు జరపడంతో యువతి శరీరంలో బుల్లెట్ దూసుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నెల్లూరు: జిల్లాలోని బంగారుపాలెంలో దొంగలను పట్టుకునేందుకు ఎస్పై గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దొంగలు పట్టుకునే క్రమంలో ఎస్సై సోదాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. పోలీసులు సోదాలను నిర్వహిస్తుండగా దొంగలు ఎదురుదాడికి దిగారు.  దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర రూపం దాల్చి పరస్పరం దాడులు చేసుకున్నారు.  ఎస్సై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు. పోలీసులు కాల్పులకు పాల్పడటాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement