ఫీడర్‌ బేకర్‌లో తాచుపాము | Snake in Electrical substation | Sakshi
Sakshi News home page

ఫీడర్‌ బేకర్‌లో తాచుపాము

May 8 2018 7:25 AM | Updated on May 8 2018 7:25 AM

Snake in Electrical substation - Sakshi

సంతబొమ్మాళి: నౌపడ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోని నౌపడ రూరల్‌ ఫీడర్‌ బేకర్‌లో తాచుపాము కలకలం రేపింది. రీడింగ్‌ తీసుకునేందుకు వెళ్లిన షిఫ్ట్‌ ఆపరేటర్‌ గోవిందరావు సాయంత్రం 5 గంటలకు స్పీడర్‌ బ్రేకర్‌ వద్దకు వెళ్లారు. తలుపు తీయగానే బ్రేకర్‌కు తాచుపాము చుట్టి ఉండడంతో కంగారుపడి వెంటనే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత గోవిందరావు రాయితో కొట్టడంతో తాచుపాము కిందికి దిగడంతో పక్కనే ఉన్న కర్రతో దానిని కొట్టి చంపేశాడు. సుమారు ఆరడుగులు ఉందని, గతంలో కూడా నాగుపాము, కొండచిలువలు ఇలాగే కనిపించాయని సిబ్బంది తెలిపారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement